News

బీజేపీ అధ్యక్షుడిపై కేసు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. ఝార్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. పాత నోట్ల రద్దుపై మమత ప్రధానిని తూర్పారపడుతున్నారు. త‌ృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల దిలీప్ ఘోష్ ‘ఆమె ఢిల్లీ వెళ్లి ఆడి పాడారు. అక్కడ మా ప్రభుత్వం ఉంది. తలుచుకుంటే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చి పడేసేవాళ్లం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆమె మతిస్థిమితం కోల్పోయారని, గంగలో దూకుతారేమోనని అనుకున్నామని కూడా ఆయన అన్నారు. రెండు సందర్భాల్లో దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎవరికీ భయపడేది లేదని, నోట్ల రద్దుపై తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎట్టకేలకు దిలీప్ ఘోషపై కేసు నమోదైంది.